Share News

అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి: ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు

ABN , Publish Date - Jan 31 , 2026 | 09:37 PM

సీఎం చంద్రబాబుపై పరుష పదజాలం వాడిన అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఆయన మాటలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి: ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు
Kalishhetti Appala Naidu

సీఎం చంద్రబాబుపై పరుష పదజాలం వాడిన అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఆయన మాటలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా, అభివృద్ధి జరగకుండా ఉండేందుకే వైసీపీ నేతలు కొత్తగా జిత్తులమారి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబును దూషిస్తే మిగతా వారంతా భయపడతారని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారన్నారు (Kalishhetti Appala Naidu reaction).


అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు సతీమణిని నిండు అసెంబ్లీలో దూషించి వైసీపీ నేతలు పాపం మూటకట్టుకున్నారని విమర్శించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబును దూషిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మరింత బుద్ధి చెబుతారని కలిశెట్టి అన్నారు (Ambati remarks controversy). అంబటి భేషరతుగా క్షమాపణ చెప్పాలని, చట్టపరమైన చర్యలకు ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాల వల్ల ప్రజలు ఆ పార్టీని సమాధి చేయడం ఖాయమని అన్నారు.


Also Read:

నేను ఇంత పెద్ద వయస్సులో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: అంబటి రాంబాబు

జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు

For More Latest News

Updated Date - Jan 31 , 2026 | 09:37 PM