Home » Amaravati
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ భవనానికి కొత్త డిజైన్ రూపొందిస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా కక్కలపల్లిలోని మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ ఇన్‌చార్జ్ కార్యదర్శి మల్లికా తెలిపారు.
కొత్త ఓటర్ల జాబితా ప్రకటించక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘సర్’ (ఎస్‌ఐఆర్) తర్వాత తాజా ఓటర్ల జాబితా అక్టోబరు 3న అమల్లోకి వస్తుందని... ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్లీ వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని సీఎం దృష్టికి తెచ్చారు. అందువల్ల అక్టోబరు 3లోపే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ కింద ఇప్పటికే కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న సింగిల్ విలేజ్ స్కీమ్స్, మల్టీ విలేజ్ స్కీమ్స్ అన్నింటికీ జేజేఎం-అమరజీవి జలధారగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వమే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోంది. ఏకగ్రీవం అయ్యే స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలను కూడా ఇస్తోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉలికిపాటుకు గురిచేసింది.
అమరావతి వేదికగా ఏపీ ప్రభుత్వం - యునైటెడ్ కింగ్డమ్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈరోజు సమావేశమయ్యారు.
ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. పనుల పురోగతిని సమీక్షించారు.