Share News

Ananthapuram News: వామ్మో.. చలి.. జ్వరం.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న పీడితులు

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:34 PM

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లో లేక మరే ఇతర కారణాల వల్లనో కాని పెద్దసంఖ్యలో అనారోగ్యానిరి గురయ్యారు. కాగా.. చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో జలుబు, జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

Ananthapuram News: వామ్మో.. చలి.. జ్వరం.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న పీడితులు

- ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో

- ఒక్కరోజే ఓపీకి వెయ్యిమందికిపైగా..

ధర్మవరం(అనంతపురం): చలి, జ్వరం, కీళ్ల నొప్పులతో జిల్లావాసులు వణికిపోతున్నారు. చలి విపరీతంగా పెరగడంతో జనం జలుబు, జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ధర్మవరం ప్రభుత్వాస్పత్రి(Dharmavaram Govt Hospital)ని ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం విజిట్‌ చేసింది. ప్రజలు జ్వరంతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక్కరోజే వెయ్యి మందికిపైగా రావడంతో ఆస్పత్రి కిటకిటలాడింది. స్త్రీ, పురుషుల ఓపీ వార్డులు రోగులతో నిండిపోయాయి.


pandu3.2.jpg

రక్తనమునాలు, ఎక్స్‌రే గదుల వద్ద రోగులు పెద్దసంఖ్యలో వేచి ఉండడం కనిపించింది. 10రోజులుగా ఓపీకి జ్వర పీడితులు పెరిగినట్లు ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వేడి నీరు తాగాలనీ, ఎండలో కాసేపు ఉండాలని తెలిపారు.


pandu3.4.jpg

ఓపీ పెరిగింది..

ఆస్పత్రిలో ఓపీ పెరిగింది. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండటంతో ప్రజలు జలుబు, ఆయాసం, ఒళ్లునొప్పులతో వస్తున్నారు. చలికాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

- తిప్పేంద్రనాయక్‌, ఆస్పత్రి

సూపరింటెండెంట్‌, ధర్మవరం


ఈ వార్తలు కూడా చదవండి..

2న మళ్లీ సభకు వస్తారా?

గర్భధారణ 30 ఏళ్లలోపే...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 30 , 2025 | 12:34 PM