Share News

Train Tickets: రైల్వే టిక్కెట్‌ ధరలు పెరిగాయ్‌..

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:14 AM

రైల్వే చార్జీలు పెరిగాయి. ఈమేరకు భారతీయ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ నెల 21నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే..215 కిలోమీటర్లలోపు ఆర్డినరీలో ప్రయాణాన్ని కొనసాగించే వారికి ఎలాంటి ధరల పెంపు లేదు.

Train Tickets: రైల్వే టిక్కెట్‌ ధరలు పెరిగాయ్‌..

- 215 కిలోమీటర్ల దాటిన వారికి మాత్రమే

ఏలూరు: రైలు ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ భారతీయ రైల్వే శాఖ ఈ నెల 21న ప్రకటించింది. పెంచిన ధరలను శుక్రవారం నుంచి అమలులోకి తీసుకొచ్చారు. రిజర్వేషన్‌ చేయించుకున్న వారి ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని, ధరలు ప్రకటించిన రోజున రిజర్వేషన్‌ చేసుకుని 26వ తేదీ నుంచి ప్రయాణాన్ని కొనసాగించేవారికి వర్తిస్తాయని ప్రకటించారు. సబర్బన్‌, నెలవారీ సీజన్‌ టిక్కెట్ల వారికి ధరల పెరుగుదల వర్తించదు. 215 కిలోమీటర్లలోపు ఆర్డినరీలో ప్రయాణాన్ని కొనసాగించే వారికి ఎలాంటి ధరల పెంపు లేదు.


ఆర్డనరీ రైళ్లల్లో 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి కిలోమీటరుకు ఒక పైసా చొప్పున మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, నాన్‌ ఏసీ, ఏసీ వంటి రైళ్లల్లో ప్రయాణించే వారికి కిలోమీటరుకు 2 పైసలు వంతున టిక్కెట్‌ ధరలు పెంచారు. నాన్‌ ఏసీ రైళ్లల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి పశ్చిమలో రైల్వే ప్రయాణికులపై రెండు కోట్లకు పైనే భారం పడుతుందని అంచనా. ఈ ఏడాది రైల్వే టిక్కెట్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి. గతంలో జూలైలో పెంచారు.


zzzzzzz.jpg

ప్రస్తుతం జిల్లా నుంచి వివిధ నగరాలకు, పట్టణాలకు సుదూర ప్రాంతాలకు ప్రయాణాన్ని కొనసాగించాలంటే రైళ్ల పైనే ప్రయాణం ఆధారపడి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తణుకు-భీమవరం మీదుగా విజయవాడ, నర్సాపురం-భీమవరం మీదుగా విజయవాడ(Vijayawada) నుంచి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌, ముంబయ్‌ వెళుతుంటారు. భువనేశ్వర్‌, కలకత్తా ప్రయాణాలు ఉంటున్నాయి. తాడేపల్లిగూడెం మెయిన్‌లైన్‌, భీమవరం బ్రాంచ్‌ లైన్‌ మీదుగా ప్రతిరోజు వందకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం, తణుకు, పాలకొల్లు నుంచి అత్యధికంగా రైల్వే ప్రయాణాలు చేస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..

3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2025 | 11:14 AM