Ananthapuram News: ఆహా.. చిరుత చూడండి.. ఎంత దర్జాగా తిరుగుతోందో..
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:00 PM
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో చిరుతపులుల సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఓ గ్రానైట్ కొండపై, అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
గ్రానైట్ కొండలో చిరుత సంచారం...
భయాందోళనలో రైతులు
కళ్యాణదుర్గం(అనంతపురం): కళ్యాణదుర్గం(Kalyanadurgam) మండల కేంద్రానికి సమీపంలోగల గ్రానైట్ కొండలో గురువారం చిరుత కనిపించడంతో స్థానిక రైతులు భయాందోళన చెందారు. గత కొన్ని రోజులుగా ఈ కొండలో చిరుత సంచరిస్తున్నట్లు సమీప పొలాల రైతులు పేర్కొన్నారు. అలాగే ఎలుగుబంట్ల సంచారం కూడా అధికంగా ఉంటోంది. దీంతో రాత్రి సమయాల్లో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నట్లు వారు వాపోయారు. అటవీశాఖాధికారులు స్పందించి చిరుతను బంధించాలని రైతులు, ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

ఆవును చంపిన చిరుత...
కళ్యాణదుర్గం: కుందుర్పి మండలంలోని రుద్రంపల్లిలో నివాసం ఉంటున్న రైతు ఈరన్న ఆవుపై చిరుతపులి దాడి చేసి, చంపిన సంఘటన గురువారం జరిగింది. బాధితుడు తెలిపిన మేరకు... తనకున్న ఆవులను మేత కోసం సమీప కొండ ప్రాంతాల్లోకి తోలుకెళ్లాడు. పొదల చా టున దాగి ఉన్న చిరుతపులి ఆవుపై దాడి చేసిందన్నారు. గమనించి గట్టిగా కేకలు వేయడంతో కొండలోకి పారిపోయిందన్నారు. ఆవును గమనించగా అప్పటికే మృతి చెందిందన్నారు. ఆవు మృతితో సుమారు రూ.30వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. చిరుతపులి సంచారంతో రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News