Home » Amaravati
కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు.
శ్రీశైల జలాశయానికి ఇన్‌ఫ్లో పుర్తిగా నిలిచిపోయింది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి అనంతరం 5,075 క్యూసెక్కులు విడుదలైనప్పటికీ సాయంత్రానికి రిజర్వాయర్‌కు చుక్కనీరు చేరలేదు.
గుంటూరులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ భూకబ్జా ఉదంతం కలకలం రేపింది. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం రాజకీయవర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుల్లో సంచలనం సృష్టించింది.
రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. సీమ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులు చేయడంతో పాటు వివిధ పథకాల అమలులో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండేళ్లలో ఇక్కడ రూ.8,022కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు.
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ-2026 (సర్) ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిముల, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది.
హలో.. మీకు ఫలానా కాలేజీలో సీటు వచ్చింది కదా!. దానికంటే మంచి బ్రాంచ్‌లో సీటు ఇప్పిస్తాం. మేం చెప్పిన కాలేజీలో చేరండి. అన్నీ మేం చూసుకుంటాం. మొదట వచ్చిన సీటు అక్కర్లేదని రిజెక్ట్ చేయండి.’ అంటూ కొన్ని కాలేజీలు విద్యార్థులకు ఎర వేస్తున్నాయి.
ఏళ్లతరబడి రాత్రింబవళ్లూ కష్టపడి చదివి మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికయ్యామని డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు పునరుద్ఘాటించారు. దగా డీఎస్సీ అంటూ తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా పదేపదే అవమానిస్తూ,
ముప్పై ఏళ్ల కల సాకారం కాబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటి మూడు నెలల కాలం సోమవారంతో పూర్తికానుంది. ఈ 3 నెలల కాలంలో రాష్ట్రంలో పట్టుమని వారం రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురవలేదు.
తిరుపతి నైలిట్ సెంటర్ తరలింపు ప్రసక్తే లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అమరావతిలో నైలిట్ క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.