Share News

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:05 AM

ఈ ఏడాది అరటి పంట సాగు చేస్తున్న రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారికి సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లైంది. అరటికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుండడంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టన్ను అరటికి రూ.21వేలు పలుకుతోంది

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

యాడికి(అనంతపురం): అరటి రైతుల మొహంపై ‘ధర’హాసం కనిపిస్తోంది. పాతాళానికి పడిపోయిన ధర ఇటీవల మళ్లీ పెరిగింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొదటిపంట టన్ను రూ.21వేలు పలుకుతోంది. మండలంలో అరటి మొదటి పంటను 1200ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో ఎక్కువశాతం జనవరి నెలాఖరు, ఫిబ్రవరి నెలల్లో దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అప్పటికి అరటి ధరలు ఇంకాస్త పెరగవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


pandu1.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Read Latest Telangana News and National News

pandu1.3.jpg

Updated Date - Jan 07 , 2026 | 11:05 AM