Home » AIADMK
‘మక్కళై కాప్పోమ్...తమిళగత్తై మీడ్పోమ్’ (ప్రజలను కాపాడుదాం... రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం...!) పేరుతో తాను చేపట్టిన పర్యటన వంద నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయిందని, అన్ని చోట్లా మహిళలు, యువత తనకు ఘనస్వాగతం పలుకుతున్నారని, వీరి స్పందన చూస్తుంటే శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే విజయం ఖాయమని బీజేపీ రాష అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ జోస్యం తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సర్వేలో డీఎంకే కూటమి అన్ని చోట్లా చిత్తుగా ఓడిపోతుందని పేర్కొన్నారు. తెన్‌కాశి జిల్లా శంకరన్‌కోవిల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
ఐకమత్యంతో కూడిన బలమైన అన్నాడీఎంకేను ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్ల ప్రతి నేతా, కార్యకర్తా ఏకతాటిపైకి రావాలని ఆ పార్టీ బహష్కిృత నాయకురాలు శశికళ(Shashikala) పిలుపునిచ్చారు. ఇదే విషయంపై ఆమె శనివారం ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఎద్దేవా చేశారు.
డీఎంకేను అధికారం నుండి ఇంటికి సాగనంపేందుకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంలో గత నెల 7వ తేదీన కోవై మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర మంగళవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగం చేరుకుంది.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
అన్నాడీఎంకే ప్రచారసభలోకి ఖాళీ అంబులెన్స్ రావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మక్కలై కాప్పోం-తమిళగత్తై మీడ్పోం’ నినాదంతో గత నెల 7న ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్రలో భాగం గా సోమవారం రాత్రి వేలూరు సమీపంలోని అనైకట్టు ప్రాంతంలో ఈపీఎస్ రోడ్‌షో నిర్వహించారు.
రాష్ట్రాన్ని 30యేళ్లకు పైగా పరిపాలించిన అన్నాడీఎంకే మరింత బలపడడానికి అనుభవం కలిగిన వారి సలహాలను పాటించాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు మైత్రేయన్ డీఎంకేలో చేరారు.