Share News

Chennai News: ఆంధ్రాలో చిరంజీవే పార్టీని విలీనం చేశారు...

ABN , Publish Date - Aug 27 , 2025 | 10:49 AM

ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్‌ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్‌ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఎద్దేవా చేశారు.

Chennai News: ఆంధ్రాలో చిరంజీవే పార్టీని విలీనం చేశారు...

- నటుడు విజయ్‌కు మాజీ మంత్రి వేలుమణి హితవు

చెన్నై: ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్‌ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్‌ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former Minister SP Velumani) ఎద్దేవా చేశారు. మదురైలో సెప్టెంబరు 1 నుంచి ఎడప్పాడి పళనిస్వామి ప్రచారం చేపట్టనున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేలా కున్నత్తూర్‌లో అన్నాడీఎంకే పూతల సమావేశం సోమవారం జరిగింది.


nani4.2.jpg

ఈ సమావేశంలో వేలుమణి మాట్లాడుతూ... ఎంతో మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పుడు కూడా నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. మదురై మహానాడులో ఆయన ప్రసంగం ప్రజలందరూ విన్నారన్నారు. ఆయన చిత్రాలు (నటుడు విజయ్‌) చిత్రాలు చూసి మేము కూడా ఆనందించామని, కానీ, మదురై మహానాడులో అన్నాడీఎంకే నేత ఎవరు? అని ప్రసంగించడం విడ్డూరంగా ఉందన్నారను. 2026 ఎన్నికల్లో ఈపీఎస్‌ ముఖ్యమంత్రి అవుతారని, విజయ్‌ సహా ఎవరూ దీనిని అడ్డుకోలేరని వేలుమణి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2025 | 10:49 AM