BJP Nagendran: 234 నియోజకవర్గాల్లో ఎన్డీయే విజయం తథ్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 09:58 AM
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే విజయం ఖాయమని బీజేపీ రాష అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ జోస్యం తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సర్వేలో డీఎంకే కూటమి అన్ని చోట్లా చిత్తుగా ఓడిపోతుందని పేర్కొన్నారు. తెన్‌కాశి జిల్లా శంకరన్‌కోవిల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే విజయం ఖాయమని బీజేపీ రాష అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) జోస్యం తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సర్వేలో డీఎంకే కూటమి అన్ని చోట్లా చిత్తుగా ఓడిపోతుందని పేర్కొన్నారు. తెన్‌కాశి జిల్లా శంకరన్‌కోవిల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎన్డీయేకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) అధ్యక్షుడిగా ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం(Former Chief Minister Panneerselvam) ఎన్డీయేలో కొనసాగుతున్నట్లుగానే తాము భావిస్తున్నామని, ఎఎంఎంకే నేత టీటీవీ దినకరన్ ఎన్డీయేలో కొనసాగుతున్న స్పష్టంగా ప్రకటించారని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News