EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. రాసిపెట్టుకోండి.. స్టాలిన్ కల ఫలించదు
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:19 PM
పెద్ద కూటమిని అడ్డం పెట్టుకుని, దాని ద్వారా మళ్లీ అధికారం పొందాలనే సీఎం స్టాలిన్ కల ఫలించదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీన కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర గురువారం మదురై ఈస్ట్ నియోజకవర్గంలోని పలంగానత్తం, సెంట్రల్ నియోజకవర్గం మేళమాసివీధి ప్రాంతాల్లో జరిగింది.
- కూటమి ద్వారా అధికారం కల్ల
- ఎడప్పాడి పళనిస్వామి
చెన్నై: పెద్ద కూటమిని అడ్డం పెట్టుకుని, దాని ద్వారా మళ్లీ అధికారం పొందాలనే సీఎం స్టాలిన్(CM Stalin) కల ఫలించదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీన కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర గురువారం మదురై ఈస్ట్ నియోజకవర్గంలోని పలంగానత్తం, సెంట్రల్ నియోజకవర్గం మేళమాసివీధి ప్రాంతాల్లో జరిగింది.
ఈ రోడ్‌షోలో ఈపీఎస్ మాట్లాడుతూ మదురై పశ్చిమ నియోజకవర్గం అన్నాడీఎంకేకు కంచుకోట అని, ఇక్కడి ప్రజలను మభ్యపెట్టి ఎలాగైనా గెలుపొందాలని డీఎంకే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. నాలుగేళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న డీఎంకే ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చూపుతోందని అరోపించారు. టాస్మాక్‌లో అవినీతిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు త్వరలోనే పలువురిని అరెస్టు చేసే అవకాశముందన్నారు.
సీఎం స్టాలిన్ పెట్టుబడులు సమీకరించేందుకు విదేశాలకు వెళ్లలేదని, తాము దోచుకున్న నగదు పెట్టుబడిగా పెట్టేందుకే వెళ్లారని ఈపీఎస్ ఆరోపించారు. విల్లుపురం జిల్లా దిండివనం మున్సిపాలిటీలో పనిచేస్తున్న దళిత వర్గానికి చెందిన ఓ అధికారిని గురువారం కమిషనర్ కార్యాలయానికి రప్పించి ఓ మహిళా కౌన్సిలర్ కాళ్లు పట్టుకునేలా చేయడం సామాజిక న్యాయమా? అని ఈపీఎస్ ప్రశ్నించారు.

మదురై పార్లమెంట్ సభ్యుడు సీపీఐకు చెందిన ఎంపీ వెంకటేశన్ కూడా మదురై కార్పొరేషన్‌లో జరిగిన రూ.2కోట్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రాలేదని, ఈ నేతల పనితీరును ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. అధికార డీఎంకే నేతలకు దివంగత మాజీముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబం మాత్రమే చిరునామా అని, డీఎంకే కుటుంబ పాలనకు స్వస్తిపలికేందుకు రాష్ట్రప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News