Home » AIADMK
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుసుకుని కారులో తిరిగి వెళుతూ తాను ముఖం చాటేశానంటూ వస్తున్న విమర్శల్ని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొట్టిపారేశారు. చెమటపడితే రుమాలుతో తుడుచుకుంటూ వెళ్లానని, దానిపై ప్రసార మాధ్యమాలకు తోడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎలాంటి విభేదాలు లేకుండా పటిష్ఠంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ మరోమారు స్పష్టంచేశారు.
తాము అధికారంలోకి వస్తే డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన పథకాలను మళ్లీ ప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కోవై జిల్లా పొల్లాచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు, రైతులు, నేత కార్మికులు, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.
అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఉదయనిధికి కౌంటర్ ఇచ్చేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్(EPS) ఘాటుగా విమర్శించారు. వారి పార్టీ వెంటిలేటర్‌పై ఉందన్న వాస్తవాన్ని గ్రహించకుండా అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని ఉదయనిధి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి అని తాను చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది జాతీయ పార్టీ అని, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి 210 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో దిండిగల్‌లోని ఓ హోటల్‌లో పళనిస్వామి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.
పెద్ద కూటమిని అడ్డం పెట్టుకుని, దాని ద్వారా మళ్లీ అధికారం పొందాలనే సీఎం స్టాలిన్ కల ఫలించదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీన కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర గురువారం మదురై ఈస్ట్ నియోజకవర్గంలోని పలంగానత్తం, సెంట్రల్ నియోజకవర్గం మేళమాసివీధి ప్రాంతాల్లో జరిగింది.