Share News

Chennai News: అమిత్‌షాకు తేల్చి చెప్పిన ఈపీఎస్‌.. ఓపీఎస్‌, శశికళకు నో ఎంట్రీ

ABN , Publish Date - Sep 18 , 2025 | 10:48 AM

పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.

Chennai News: అమిత్‌షాకు తేల్చి చెప్పిన ఈపీఎస్‌.. ఓపీఎస్‌, శశికళకు నో ఎంట్రీ

చెన్నై: పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో ఎంపీ సీవీ షణ్ముగం, కేపీ మునుసామి, దిండుగల్‌ శీనివాసన్‌, ఎస్పీ వేలుమణి, తంబిదురై, ఇన్బదురై, ధనపాల్‌ తదితరులతో కలిసి అమిత్‌షాను ఆయన నివాసంలో ఈపీఎస్‌ కలుసుకున్నారు.


nani1.2.jpg

సుమారు 45 నిమిషాలకు పైగా పైగా ఇద్దరూ చర్చించుకున్నారు. ముందుగా అమిత్‌షాకు పుష్పగుచ్ఛం, శాలువతో సత్కరించారు. ఆ తర్వాత ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగ్‌ దేవర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈపీఎస్‌ ప్రచారం గురించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గురించి అమిత్‌షా అడిగి తెసుకున్నారు. ఆ తరువాత ఈపీఎస్‌, అమిత్‌షా ఏకాంతంగా భేటీ అయినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని బలపరిచే దిశగా కొత్త పార్టీలను చేర్చుకునే విషయమై ఆ నేతలు చర్చించుకున్నారు.


nani1.3.jpg

అంతేగాక టీటీవీ దినకరన్‌, ఓపీఎస్‌, శశికళను అన్నాడీఎంకేలో మళ్ళీ చేర్చుకునే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురిని చేర్చుకునే ప్రసక్తేలేదని, పార్టీకి ద్రోహం చేసిన వారిని మళ్ళీ చేర్చుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని ఈపీఎస్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే వారిని ఎన్డీయే కటమిలో చేర్చుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదన్నట్లు సమాచారం. చివరకు అమిత్‌షా ఈపీఎస్‌ వాదనతో ఏకీభవించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 18 , 2025 | 10:48 AM