Share News

EPS: మాజీసీఎం క్లారిటీ.. అబ్బే.. ముఖం చాటెయ్యలా.. చెమట తుడుచుకున్నా

ABN , Publish Date - Sep 19 , 2025 | 10:59 AM

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుసుకుని కారులో తిరిగి వెళుతూ తాను ముఖం చాటేశానంటూ వస్తున్న విమర్శల్ని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) కొట్టిపారేశారు. చెమటపడితే రుమాలుతో తుడుచుకుంటూ వెళ్లానని, దానిపై ప్రసార మాధ్యమాలకు తోడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

EPS: మాజీసీఎం క్లారిటీ.. అబ్బే.. ముఖం చాటెయ్యలా.. చెమట తుడుచుకున్నా

- ఎడప్పాడి పళని స్వామి

చెన్నై: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుసుకుని కారులో తిరిగి వెళుతూ తాను ముఖం చాటేశానంటూ వస్తున్న విమర్శల్ని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) కొట్టిపారేశారు. చెమటపడితే రుమాలుతో తుడుచుకుంటూ వెళ్లానని, దానిపై ప్రసార మాధ్యమాలకు తోడు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో గురువారం ఉదయం ఈపీఎస్‌ సమక్షంలో ఇతరపార్టీలకు చెందిన కొందరు అన్నాడీఎంకేలో చేరారు.


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 7 నుండి తాను చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వస్పందన లభిస్తోందని, ఇప్పటి వరకు 153 నియోజకవర్గాలలో పర్యటించానని చెప్పారు. పర్యటనలో ప్రజాస్పందన చూస్తుంటే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోందన్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రధాని నరేంద్రమోదీకి నల్లజెండాలు ప్రదర్శించిన డీఎంకే అధికారంలోకి వచ్చాక రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలుకటంలో రహస్యమేంటని ప్రశ్నించారు.


ఇటీవల తిరునల్వేలిలో కాంగ్రెస్‌ మహానాడు జరిగినప్పుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చోడంకర్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 117 నియోజకవర్గాల్లో పోటీ చేయనుందని ప్రకటించారని, మాజీ టీఎన్‌సీసీ నేత కేఎస్‌ అళగిరి మాత్రం ఈ సారి డీఎంకే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ అధికారంలో భాగస్వామ్యం కోరుతుందన్నారని గురు చేస్తూ.. ఈ విషయాలపై స్టాలిన్‌గానీ, ప్రసారమాధ్యమాలు గానీ పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. ఆ విషయాన్ని వదిలేసి తాను ఢిల్లీలో ముఖం చాటేశానంటూ అదేపనిగా విమర్శలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు.


nani1.2.jpg

తాను సీఎం పదవిని చేపట్టిన తర్వాత అన్నాడీఎంకే పాలన ఏ క్షణంలోనైనా కుప్పకూలుతుందని ప్రసారమాధ్యమాలన్నీ విమర్శించాయే తప్ప తనను ఏ మాత్రం ప్రోత్సహించలేదని విమర్శించారు. ఈ నెల 16న ఢిల్లీలో తమిళనాడు హౌస్‌ నుండి ప్రభుత్వం కేటాయించిన కారులోనే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలుసుకునేందుకు వెళ్ళానని, తనతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు కూడా వచ్చారని గుర్తు చేశారు. అదే రోజు రాత్రి అమిత్‌షాను కలుసుకునేందుకు కూడా ప్రభుత్వ కారులోనే వెళ్ళానన్నారు.


అమిత్‌షాతో భేటీ ముగిశాక తాను బయటకు వచ్చి కారులో బయలుదేరుతూ చెమట పడితే ఖర్చీ్‌ఫతో ముఖం తుడుచుకోవడాన్ని అటు ప్రసారమాధ్యమాలు, ఇటు స్టాలిన్‌ వివాదాస్పదంగా మార్చటం బాధాకరమన్నారు. కరూరు ‘ముప్పెరుంవిళా’ సభ ఏర్పాట్లను చేపట్టిన మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీపై స్టాలిన్‌ పొగడ్తల వర్షం కురిపించడం కూడా వింతగా ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెంథిల్‌బాలాజీ వంటి అవినీతిపరుడు మరొకడు లేదని విమర్శించిన విషయాన్ని మరచిపోయినట్లుందని ఈపీఎస్‌ ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి

శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 19 , 2025 | 10:59 AM