Home » ABN
భోజనం చేసిన వెంటనే చాలా మంది కుర్చీలో కూర్చొంటారు. మంచంపై నడుం వాల్చేస్తారు. అలా చేయడం కంటే.. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 22 షాపులు దగ్ధమయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో మరిన్ని మున్సిపాల్టీలు, పంచాయితీలను విలీనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో నగర విస్తీర్ణం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా.. పలువురు నిపుణులు కీలక అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ నూతన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆస్ట్రేలియా చరిత్రలో ప్రధాని హోదాలో పెళ్లి చేసుకున్న తొలివ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో మంటలు చెలరేగగా.. ప్రమాదాన్ని పసిగట్టి తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
CAT 2025 పరీక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకే రోజు మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు కీలక సూచనలు.
మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు.
దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ పోరాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేసీఆర్ పోరాటం గురించి మూర్ఖంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
పొట్ట కూటి కోసం ర్యాపిడో బైక్ తోలుకునే ఓ డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించింది ఈడీ. ఓ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో ఈ విషయం వెలుగుచూసింది.