ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:47 PM
ఎన్టీఆర్ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అలాగే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారాయన.
అమరావతి, ఫిబ్రవరి 15: ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, నమ్మకమని.. ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి ద్వారా ఈ ట్రస్ట్ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ఈ ట్రస్ట్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందిస్తోందని వివరించారు. సామాజిక సేవే పరమావధిగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఆదివారంతో 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ట్రస్ట్‌కు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన.
అలాగే.. ఆదివారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేశ్. భోళా శంకరుడు లింగోద్భవం చెందిన పవిత్రమైన రోజు.. ఈ మహా శివరాత్రి అని ఆయన పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణతో నీలకంఠుడి కృపకు ప్రజలు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్
రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
For AP News And Telugu News