Home » ABN
దుబాయ్ ఎయిర్ షోలో ఫ్లైట్ కూలిపోవడంతో మృతిచెందిన పైలట్‌కు ఆయన భార్య కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సైనికుల గౌరవ వందనాల నడుమ ఆయన అంత్యక్రియలు నిర్వహించింది ఐఎఎఫ్.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. లోకేశ్‌ను ప్రజలు, కార్యకర్తలు కలిసి.. తమ సమస్యలు విన్నవించుకున్నారు. వీటిని పరిష్కరిస్తానని వారికి మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురంలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.
అల్లూరి జిల్లా జీనబాడులో విషాదం నెలకొంది. రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మరో మోసానికి కుట్ర లేపిందంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు నెలన్నర ముందే సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ వేళ ఆయా ఊర్లకు వెళ్లడానికి ప్రయాణికులు టికెట్లు రిజర్వ్ చేసుకోవడమే ఇందుకు కారణం. దీంతో బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 500 దాటిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్.. ఒక్కసారిగా ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి.
సౌతాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం నూతన కెప్టెన్‌కు ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఈ సిరీస్ కోసం కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్‌బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆ తర్వాత..
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా ఆదివాసీలు పోటెత్తారు.