ఫిట్‌గా ఉండాలని ఎలాంటి డైట్ ఫాలో కావాలంటే.?
ABN , Publish Date - Feb 09 , 2026 | 07:22 PM
నేటి యువత ఆరోగ్యంతో పాటు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు తీసుకునే ఆహారమే మీ ఫిట్‌నెస్‌కి కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ఫిట్‌గా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో కావాలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. కానీ డైట్ విషయంలో సరైన శ్రద్ధ చూపరు. ఫిట్‌గా ఉండటం అంటే తక్కువ తినడం మాత్రమే కాదు, సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని సరైన పరిమాణంలో తీసుకోవాలి. మంచి నిద్ర, రోజూ వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఫిట్‌గా ఉండాలంటే.. పాలు, అరటిపండు, ఖర్జూరాలు, పండ్లు, ఓట్స్ వంటి ఆహారాలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
1. కూరగాయలు, పండ్లు:
రోజూ కనీసం రెండు రకాల పండ్లు, ఆకుకూరలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. వీటిలో ఉండే ఫైబర్(పీచు) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2. నీరు:
శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, కండరాల పనితీరును పెంచి, అలసటను తగ్గించి, విష పదార్థాలను బయటకు పంపుతుంది.
3. జంక్ ఫుడ్‌కు దూరం:
ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మంది ఇన్‌స్టంట్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. జంక్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్లు, సమోసాలు, ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడుల్స్ వంటి నూనెలో వేయించిన పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంకా.. స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఐటమ్స్(చిప్స్), ఇతర పానీయాలు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫిట్‌గా ఉండలేరు.
4. తినే పద్ధతి:
ఉదయం వ్యాయామం చేసిన తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఇది రోజంతా మీకు శక్తినిస్తుంది. రాత్రి పడుకోవడానికి 2-3 గంటల ముందే భోజనం చేయాలి. రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకుంటే చాలా మంచిది. రోజుకు ఒకేసారి ఎక్కువగా తినకుండా.. కనీసం 5-6 సార్లు తక్కువ మోతాదులో తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది.
5. కొబ్బరి నీళ్లు, మజ్జిగ:
కూల్ డ్రింక్స్, షుగర్ ఉన్న జ్యూస్‌లకు బదులుగా కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు, చలువ చేయడానికి మజ్జిగ ఎంతో మంచిది. మెటబాలిజంను పెంచి కొవ్వు కరగడానికి గ్రీన్ టీ ఎంతగానో సాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ