• Home » 2025

2025

SCIENCE: కౌశల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థి

SCIENCE: కౌశల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థి

కౌశల్‌ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్‌ఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్‌తేజ్‌ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్‌ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్‌తేజ్‌ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.

APM: పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

APM: పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్‌, చేపట్టిన పనుల వివరాలు వివరించారు.

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ

మండల పరిఽధిలోని కటారుక్రాస్‌లోని రెడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్‌ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు.

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌

జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్‌స, డీఎంహెచఓకి సూచించారు.

TDP: పీఎంఏవై 2.0ను సద్వినియోగం చేసుకోండి

TDP: పీఎంఏవై 2.0ను సద్వినియోగం చేసుకోండి

ప్రధానమంత్రి అవాస్‌ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్‌ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

AWARENESS: ఎయిడ్స్‌పై అవగాహన

AWARENESS: ఎయిడ్స్‌పై అవగాహన

ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని సోమవారం ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం ఏర్పాటుచేసి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు.

TDP: అర్హులందరికీ పింఛన్లు : పరిటాల శ్రీరామ్‌

TDP: అర్హులందరికీ పింఛన్లు : పరిటాల శ్రీరామ్‌

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రతిపేద వాడి ముఖంలో ఆనందం కనిపిస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్‌ కాలనీలో ఎన్టీఆర్‌భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందజేశారు.

MLA: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

MLA: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సిఽంధూరరెడ్డి అన్నారు. చినగానిపల్లిలో సోమ వారం నిర్వహించిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మండలంలోని మహమ్మదాబాద్‌ ఎస్సీ కాలనీ, కసముద్రం, సోలుకుంట్ల, బలకవారిపల్లి, అమడగూరు, చినగానిపల్లి పంచాయతీలో ఎనటిఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.

MLA: సమస్యలు తెలుసుకునేందుకే మీ వద్దకు

MLA: సమస్యలు తెలుసుకునేందుకే మీ వద్దకు

ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి మీ ఇంటివద్దకే వచ్చామని ఎ మ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలపరిధిలోని గోవిం దురాజులపల్లిలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన ప్రతి ఇంటివద్దకు వెళ్లి పింఛనదారుల యోగక్షేమాలు తెలుసుకుని పింఛన్లు అందించారు.

WELLS: ప్రమాదకరంగా బావులు

WELLS: ప్రమాదకరంగా బావులు

మండలపరిధిలోని చౌటకుం ట పల్లి నుంచి కదిరి మెయిన రోడ్డుకు లింక్‌రోడ్డు పనులు జరగుతు న్నాయి. ఈ రోడ్డుకు అనుకుని మూడు పాడు బడిన బావులు ఉన్నా యి. ఈ బావుల వద్ద ఎలాంటి రక్షణ గోడలు లేవు. బావుల వద్ద గోడ లు లేకపోవడం వల్ల లింక్‌ రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా వచ్చి నప్పుడు వాహనదారులు ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించిని ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి