GOD: వైభవంగా అయ్యప్పస్వామి రథోత్సవం
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:29 PM
మండల కేంద్రానికి సమీపం లో ఎం. కొత్తపల్లి వద్ద బం డపై వెలసిన అ య్యప్ప స్వామి సన్నిధానంలో స్వామి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువా రం ఆలయ నిర్మాణ సంకల్ప కులు పచ్చార్ల ఆంజినేయులు నాయుడు ఆధ్వర్యంలో స్వా మి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సమీపం లో ఎం. కొత్తపల్లి వద్ద బం డపై వెలసిన అ య్యప్ప స్వామి సన్నిధానంలో స్వామి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువా రం ఆలయ నిర్మాణ సంకల్ప కులు పచ్చార్ల ఆంజినేయులు నాయుడు ఆధ్వర్యంలో స్వా మి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయమే ఆల యంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరిం చిన రథంలో స్వామి ఉత్సవ విగ్రాహాన్ని ఉంచి వడ్డివారిపల్లి, వైఎస్సార్ సర్కిల్, అంబేడ్కర్ స ర్కిల్, బస్టాండ్, పోలీస్ స్టేషన మీదుగా ఊరేగించారు. అధిక సంఖ్య లో మంది భక్తులు హాజరై రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ఆవరణంలో భక్తులకు అన్నదానం చేశారు. రథోత్సవం సందర్భంగా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం నుంచి అందించిన పట్టు వసా్త్రలను గురువారం తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి స్వామివారికి సమర్పించినట్టు పచ్చార్ల ఆంజినేయులు నాయుడు గురుస్వామి తెలిపారు. రథోత్స వం రోజు ఆర్డీఓ కార్యాలయం నుంచి పట్టు వసా్త్రలు అందించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన తెలిపారు.