VEHICLE: ప్రభుత్వ వాహనం మూలకు...
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:51 PM
ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్ముగా భావించి అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన బా ధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంటుంది. అయితే ఆ బాధ్యత ఎక్కడ కనిపిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల కష్టార్జి తాన్ని పన్నుల రూపంలో కట్టిన ప్రభుత్వ ధనంతో రూ. లక్షలు ఖర్చుచేసి కొను గోలు చేసిన టయోటా ఇన్నోవా వాహనం ప్రస్తుతం ఉపయోగం లేకుం డా మూలన పడింది.
వృథా ఆవుతున్న ప్రజాధనం
పుట్టపర్తి రూరల్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్ముగా భావించి అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన బా ధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంటుంది. అయితే ఆ బాధ్యత ఎక్కడ కనిపిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల కష్టార్జి తాన్ని పన్నుల రూపంలో కట్టిన ప్రభుత్వ ధనంతో రూ. లక్షలు ఖర్చుచేసి కొను గోలు చేసిన టయోటా ఇన్నోవా వాహనం ప్రస్తుతం ఉపయోగం లేకుం డా మూలన పడింది. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. గతంలో పుడా చైర్మన వినియోగం కోసం ప్రత్యేకంగా ఈ విలువైన వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయితే ప్రస్తుతం పుడాకు చైర్మన లేరు. దీంతో ఆ వాహనాన్ని కూడా ఎవరూ వినియోగించడం లేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ శిఽఽఽథిలావస్థ కు చేరుతోంది. ఈ కార్యాలయం ఆవరణలోనే రూరల్ పోలీసుస్టేషన, కోర్టు, ఎంపీడీఓ, ఎంఈఓ, ఆర్డీఓ గృహనిర్మాణ శాఖ, ఉద్యానశాఖ కార్యా లయాలు ఉన్నాయి. రూ. లక్షలు ప్రభుత్వ ధనం వెచ్చించి కొనుగోలు చేసిన ఈ వాహనం ఇలా నిరుపయోగంగా మారడాన్ని ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడానికి నిధుల కొరత ఉందని చెప్పే అదికారులకు, ఇలా ప్రజాధనం వృథా అవుతుంటే పట్టించు కోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజల డబ్బుతో కొన్న వాహనాన్ని మరమ్మతులు చేసి ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారు.