RDO: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఆర్డీవో
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:46 PM
దీర్ఘకాలికంగా నెలకొన్న చుక్కల భూముల సమస్య పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్న ట్లు ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. మండలంలోని కొండకమర్ల గ్రామ సచివాలయం ఆవరణం లో బుధవారం చుక్కల భూముల సమస్య పరిష్కారంపై గ్రామసభ నిర్వ హించారు.
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా నెలకొన్న చుక్కల భూముల సమస్య పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్న ట్లు ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. మండలంలోని కొండకమర్ల గ్రామ సచివాలయం ఆవరణం లో బుధవారం చుక్కల భూముల సమస్య పరిష్కారంపై గ్రామసభ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లో చుక్కలు భూములు ఉన్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శివరాంప్రసాద్‌రెడ్డి, సర్వేయర్ మద్దిలేటి, ఆర్‌ఐ శ్రీనివాసరెడ్డి, వీఆర్‌ఓ గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....