CHRISTMAS: కన్నుల పండువగా క్రిస్మస్
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:09 PM
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ కవర్గాల వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను ప్రత్యేకంగా విద్యుత దీపాలతో అలంకరించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ కవర్గాల వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను ప్రత్యేకంగా విద్యుత దీపాలతో అలంకరించారు. ప్రధానంగా ధర్మవరం పట్టణంలోని కొత్తపేట, మార్కెట్‌వీధి, నెహ్రూనగర్, జోగోనికుంట, రాజేంద్రనగర్, శ్రీ లక్ష్మీచెన్నకేశవపురం, లక్ష్మీనగర్, రైల్వే క్వార్టర్స్ తదితర ప్రాంతాలలోని చర్చిలలో పాస్టర్లు క్రైస్తవులచేత ప్రార్థనలు చేయించారు. లక్ష్మీనగర్ బేతేలు బాప్టిస్ట్ చర్చి లో పాస్టర్ ఎంఎస్ సుందర్‌సింగ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తోట నారా యణస్వామి, క్రిస్టియన సెల్ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు మోహనబాబు, మణి, కిరణ్, మధు, ప్రవీణ్‌ు కేక్‌కట్ చేశారు. పలు చర్చిలలో చిన్నారులచే వినోద కార్యక్రమా లు ఏర్పాటు చేశారు. ధర్మవరం రూరల్ మండలం లోని చిగిచెర్ల, బడన్నపల్లి, గరుడంపల్లి, నేలకోట, ఓబుళనాయునిపల్లి, వెంకటతిమ్మాపురం తదితర గ్రా మాల చర్చిలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వ హించారు.
పుట్టపర్తి మండలంలోని వెంగళమ్మచెరు వు, పెడపల్లి, కొట్లపల్లి, నిడిమామిడి, ఎనుమలపల్లి, కర్ణాటకనాగేపల్లిలోని చర్చి లన్నీ క్రైస్తవులతో కిటకిటలాడాయి. కొత్తచెరువులోని గుడ్‌షప్పర్డ్ చర్చి, కొడప గానిపల్లి, తలమర్ల తదితర చర్చిలలో పాస్టర్లు ప్రార్థనలు చేయించారు. బత్తల పల్లి మండలంలోని బత్తలపల్లి, రామాపురం, సంగాల, నెత్తివారంపల్లి, గుమ్మ ళ్లకుంట, నం బులపూలకుంట మండలకేంద్రంలోని శ్యాలేమా, బేతస్తా చర్చిల్లో, తూర్పునడింపల్లి, ధని యానచెరువు, వెలిచెలమల చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నల్లచెరువులోని సీఎస్‌ఐ చర్చ్‌లో సందేశాన్ని వినడానికి వచ్చిన ప్రజల కు భోజనం సౌకర్యం కల్పించారు. నల్లమాడలోని చర్చిలు, ఓబుళదేవరచెరువు లోని సీఅండ్‌ఐజీ మిషన చర్చి తతితర చర్చిలలో ప్రత్యేక పార్థనలు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....