CC ROAD: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:26 PM
గత వైసీపీ పాలనలో ఇరగంపల్లి నుంచి తలమర్ల గ్రామం వరకు తారురోడ్డు నిర్మించలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి సహకారంతో ఇరగంపల్లి నుంచి తలమర్లకు తారురోడ్డు ఏర్పా టు చేశారు.
కొత్తచెరువు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో ఇరగంపల్లి నుంచి తలమర్ల గ్రామం వరకు తారురోడ్డు నిర్మించలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి సహకారంతో ఇరగంపల్లి నుంచి తలమర్లకు తారురోడ్డు ఏర్పా టు చేశారు. అయితే గ్రామంలోకి వెళ్లే చోట నీరు ఎక్కువగా పారుతుండటంతో తారు రోడ్డు దెబ్బ తింటుందని రూ.16లక్షల నిధుల వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిదులు కేటాయించింది. దీంతో గురువారం గ్రామ సర్పంచ రత్నమ్మ, ఎంపీపీ గాయుత్రి రెడ్డప్పరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంబించారు. ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచ శ్యాంసుందర్ రెడ్డి, గ్రామస్థులు సూరి, చిన్నరాముడు, చండ్రాయుడు, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.