• Home » 2025

2025

ROADS: గ్రామీణ రోడ్లకు మహర్దశ

ROADS: గ్రామీణ రోడ్లకు మహర్దశ

రహదారులు సరిగా లేకపోవడంతో మండలపరిధిలోని పలు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఎవరూ పట్టించుకున్న పాపనపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఎవరూ పట్టించుకో లేదు. అయితే కూటమి ప్రభు త్వం రాగానే గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది.

CROP: నత్తల  దండు

CROP: నత్తల దండు

నత్త అంటే ఎక్కడో ఒకటో, రెండో కనిపిస్తుంటాయి. అలాంటి నత్తలు లక్షలాదిగా దండుగా ఏర్పడి, పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలను మొక్క దశలోనే దెబ్బతీస్తున్నాయి. మండలంలోని మహమ్మదాబాద్‌ పంచాయతీ పరిధి గొల్లపల్లి ప్రాంతంలో లక్షలాది నత్తలు పంటల్లో సంచరిస్తున్నాయి.

SP : ధర్మవరంలో తనిఖీలు

SP : ధర్మవరంలో తనిఖీలు

ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 156 మంది సిబ్బంది ఒక్కసారిగా తనిఖీలకు దిగడంతో ధర్మవరం దద్దరిల్లింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ధర్మవరం, పెనుకొండ డీఎస్పీలు హేమంతకుమార్‌, నరసింగప్ప, సీఐలు, ఎస్‌ఐలతో కలిసి ఎస్పీ సతీష్‌కుమార్‌ బుధవారం సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర ఉన్నవారికి ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

WATER: వరి పొలాల్లోకి కాలువ నీరు

WATER: వరి పొలాల్లోకి కాలువ నీరు

మండలంలోని చిన్నూరుబత్తలపల్లి వరిపొలాల్లోకి రావులచెరువుకు వెళ్లే కాలువనీరు వెళుతుండటంతో సాగురైతులు ఇబ్బందులు పడుతున్నారు. రావులచెరువుకు ధర్మవరం చెరువు నుంచి నీరు విడుదల చేశారు. అయితే చెరువుకు వెళ్లే కాలువ గడ్డితో కుంచించిపోవడంతో కాలువలో నీరు సరిగ్గా వెళ్లక చిన్నూరుబత్తలపల్లి రైతుల వరి పొలాల్లోకి వెళ్లాయి.

RDO: అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీఓ

RDO: అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీఓ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రానున్న మూడురోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్డీఓ మహేష్‌, తహసీల్దార్‌ సురేష్‌బాబు పేర్కొన్నారు. వారు బుధవారం ధర్మవరం చెరువుతో పాటు పోతుల నాగేపల్లి చిత్రావతి నది, రేగాటిపల్లి, గొట్లూరు చెరువులలో నీటి మ ట్టాన్ని పరిశీలించారు.

DAM: నిండుకుండలా సీజీ ప్రాజెక్ట్‌

DAM: నిండుకుండలా సీజీ ప్రాజెక్ట్‌

మండల పరిధిలోని ముండ్లవారిపల్లి సమీపంలో పాపాగ్నినదికి అడ్డంగా నిర్మించిన చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్‌ నిండుకుం డా దర్శనమిస్తోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థా యి నీటి మట్టం 27 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 26.12 అడుగులకు నీరు చేరింది.

SP: ఫిర్యాదుదారులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు :ఎస్పీ

SP: ఫిర్యాదుదారులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు :ఎస్పీ

పోలీస్‌ స్టేషనకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ట నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు. స్థానిక పో లీస్‌ స్టేషనను మంగళవారం ఎస్పీ అకస్మిక తనిఖీ చేశారు. రి కార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రాబో యే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు.

POLICE: పోలీసు అమర వీరులకు నివాళి

POLICE: పోలీసు అమర వీరులకు నివాళి

పోలీసు అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో పునరంకితమవుదామని వనటౌన, టూటౌన సీఐలు నాగేంద్రప్రసాద్‌, రెడ్డప్ప పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్‌స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారు సెల్యూట్‌ చేశారు.

MLA: హాస్టల్‌ వద్ద ప్రైవేటు వాహనాలు వద్దు

MLA: హాస్టల్‌ వద్ద ప్రైవేటు వాహనాలు వద్దు

పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాల యం వద్ద ఉన్న బాలికల హాస్టల్‌ సమీపంలో ప్రైవేటు కార్లు, ట్యాక్సీలను నిలుపకుండా ఆర్టీ డిపో ఆవరణంలో అద్దె వాహనాల స్టాండ్‌ ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

DSP: నిబంధనలు తప్పక పాటించాలి : డీఎస్పీ

DSP: నిబంధనలు తప్పక పాటించాలి : డీఎస్పీ

పోలీసుల నిబం ధనలు తప్పక పాటించి విక్ర యాలు జరపాలని డీఎస్పీ హే మంతకుమార్‌ టపాసుల వి క్రయదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరిం చారు. స్థానిక ప్రభుత్వ బా లుర ఉన్నతపాఠశాల క్రీడామై దానంలో టపాసుల దుకా ణా లు ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని ఆయన ఆదివారం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి