LIBRARY: గ్రంథాలయంలో కవి సమ్మేళనం
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:23 AM
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాఖా గ్రంథాల యంలో సోమవారం గ్రంథాలయ అఽధికారి అంజలిసౌభాగ్యవతి ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కవి ప్రపుల్లా చంద్ర, వెంకటేశులు, టీటీడీ ధర్మచారులు కకాకుమాను, రవీంద్ర, గాయకులు నాగరాజులను శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రంఽథాలయాల గురించి పద్యం, కవిత, పాటల ద్వారా వారు విద్యార్థులకు వివరించారు.
ధర్మవరం/ నంబులపూలకుంట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాఖా గ్రంథాల యంలో సోమవారం గ్రంథాలయ అఽధికారి అంజలిసౌభాగ్యవతి ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కవి ప్రపుల్లా చంద్ర, వెంకటేశులు, టీటీడీ ధర్మచారులు కకాకుమాను, రవీంద్ర, గాయకులు నాగరాజులను శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రంఽథాలయాల గురించి పద్యం, కవిత, పాటల ద్వారా వారు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాము, రమణనాయక్, గంగాధర్, సరస్వతమ్మ, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నంబుల పూలకుంటలోనిగ్రంథాలయంలో పుస్తకం విలువ - గ్రంథాలయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లాప రిషత ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహనరెడ్డి హాజరయ్యారు. చిరిగిన చొక్కా వేసుకున్నా ఫర్వాలేదుకానీ, ఓ మం చి పుస్తకాన్ని కొనుక్కుని చదవాలి అని సూచించారు. గ్రంథాలయ అధికారి ఫరియాబాను, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....