MARKET YARD: ప్రారంభానికి నోచుకోని మార్కెట్‌యార్డు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:56 PM
రైతులు పండించిన పంటల ను విక్రయించడానికి అనుకూలంగా ఉండడాలని గత ప్రభుత్వం మా ర్కెట్‌యార్డులను ఏర్పాటు చేసింది. మండలం లోని అరవవాండ్లపల్లి వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డు భవనాన్ని రూ.3.82 కోట్టు నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. భవనం పూర్తి అయి నాలుగు సంవ త్సరాలు పైబడింది. దాదాపు 14 ఎకరాల్లో భూవిని చదునుచేసి మొదటి విడతగా భవనం నిర్మించారు.
పనులు పూర్తి అయినా, నిరుపయోగమే
నల్లమాడ, నవంబరు17 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన పంటల ను విక్రయించడానికి అనుకూలంగా ఉండడాలని గత ప్రభుత్వం మా ర్కెట్‌యార్డులను ఏర్పాటు చేసింది. మండలం లోని అరవవాండ్లపల్లి వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డు భవనాన్ని రూ.3.82 కోట్టు నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. భవనం పూర్తి అయి నాలుగు సంవ త్సరాలు పైబడింది. దాదాపు 14 ఎకరాల్లో భూవిని చదునుచేసి మొదటి విడతగా భవనం నిర్మించారు. అయినా ప్రస్తుతం నల్లమాడ మార్కెట్ యార్డును కొత్తచెరువులోనే నిర్వహిస్తున్నారు. నల్లమాడ మండలంలో నిర్మించిన మార్కెట్‌యార్డును ప్రారంభిస్తే నల్లమాడతోపాటు, ఓడీసీ, అమడగూరు మండలాల రైతులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు. స్థానికంగా మార్కెట్‌యార్డు నిర్మించినా ప్రా రంభించకపోవడంతో రైతులు పండించిన పంటలను విక్రయించడానికి సుదూర ప్రాంతాలకు అద్దెవాహనాల్లో తీసుకెళ్లే దుస్థితి ఏర్పడింది. నల్లమాడలోనే మార్కెట్‌యార్డు ఏర్పాటు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో పండించిన పంటలను ఇక్కడే విక్రయిం చుకోవచ్చని రైతులు సంతోషపడ్డారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ ప్రాంత రైతులు పంటలను పండించి దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చులతో పాటు, అక్కడ మార్కెట్‌యార్డుల్లో కమిషన్లు ఇచ్చేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పండించిన పంటల ద్వారా తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతు న్నారు.
నల్లమాడ, పుట్టపర్తి ప్రధాన రహదారి పక్కనే ఉన్న మండలంలోని అరవాండ్లపల్లి సమీపంలోని గుట్టలో మార్కెట్‌యార్డు భవనం నిర్మించారు. ప్రారంభానికి నోచుకోలేదు. పైగా అక్కడ జనసంచారం తక్కువగా ఉండడంతో వాహనదారులు అసాంఘిక కర్యకలాపాలకు అనుకూలంగా ఉందని ప్రజలు అంటున్నారు. అక్కడ మద్యం తాగడంతోపాటు పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. మార్కెట్‌యార్డును గత వైసీపీ పాలనలో నిర్మించినా, దాన్ని ప్రారంభించకుండా అప్పుడు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడైనా అధికారులు, పాలకులు స్పందించి మార్కెట్‌యార్డును ప్రారంభిస్తే తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, జిల్లా అధికారులతో కలిసి గత నెలలో ఈమార్కెట్‌యార్డును సందర్శించి మొక్కల పెంపకం చేపట్టారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారేకానీ, భవనాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చొరవ చూపి త్వరగా మార్కెట్‌యార్డును ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....