SOCIETY : ఘనంగా సహకార వారోత్సవాలు
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:46 AM
మండలకేంద్రంలోని సహ కార సంఘం కార్యాలయంలో మంగళవారం అఖిలభారత సహకార వారోత్సవాలను సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్‌డివిజన అధికారి శివకుమార్ హాజరయ్యారు. సహకార సంఘం కార్యాలయంలో మొదటగా జెండా ఆవిష్కరించారు.
నల్లమాడ, నవంబరు18 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని సహ కార సంఘం కార్యాలయంలో మంగళవారం అఖిలభారత సహకార వారోత్సవాలను సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్‌డివిజన అధికారి శివకుమార్ హాజరయ్యారు. సహకార సంఘం కార్యాలయంలో మొదటగా జెండా ఆవిష్కరించారు. సీఈఓ కేశప్ప, ఆదినారాయణ , శ్రీరాములు, డైరెక్టర్లు గంగులప్పనాయుడు, నాగేనాయక్, టీడీపీ నాయ కులు బుట్టి నాగభూషణంనాయుడు తోట్లో మంజునాథ్‌రెడ్డి, కేశవ, మైలే రామచంద్ర, అరవింద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.