MLA: మార్కెట్‌యార్డ్ అభివృద్ధికి కృషిచేయండి
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:07 AM
మార్కెట్‌యార్డ్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పుట్ట పర్తి మార్కెట్‌యార్డ్ చైర్మన, కమిటీ సభ్యులకు సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో సోమవారం పుట్టపర్తి మా ర్కెట్ కమిటీ సమావేశాన్ని చైర్మన పూలశివప్రసాద్ అధ్యక్షతన నిర్వ హించారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
కొత్తచెరువు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌యార్డ్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పుట్ట పర్తి మార్కెట్‌యార్డ్ చైర్మన, కమిటీ సభ్యులకు సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో సోమవారం పుట్టపర్తి మా ర్కెట్ కమిటీ సమావేశాన్ని చైర్మన పూలశివప్రసాద్ అధ్యక్షతన నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మం త్రి పల్లె రఘునాథరెడ్డి, రాష్ట్ర ఇరిగేషన డెవలప్‌మెంట్ కార్పొరేషన డైరె క్టర్ పత్తి చంద్రశేఖర్ ముఖ్యఅతిఽథులుగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పండించిన పంటలను గోడౌనలలో ఉచితంగా నిల్వ ఉంచుకోవచ్చనే విషయాన్ని రైతులకు తెలియజేయా లన్నారు. రైతులు పండించిన పంటల కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేస్తామన్నారు. రైతులు దళారుల వల్ల నష్ట పోతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మద్దతు ధ రతో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....