SATHYASAI: ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:25 AM
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో బాగంగా పుట్టపర్తి పట్టణం నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు తొమ్మిది పార్కింగ్ స్థలాలను, ఏడు వైద్య శిబిరాలను, ఏడు సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసింది.
పుట్టపర్తి రూరల్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో బాగంగా పుట్టపర్తి పట్టణం నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు తొమ్మిది పార్కింగ్ స్థలాలను, ఏడు వైద్య శిబిరాలను, ఏడు సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసింది. సూపర్ స్పషాలిటీ హాస్పిటల్ వద్ద, సందీప్ బెల్లివ్, శిల్పారామం, ఆనంద్‌విల్లాస్, శ్రీసత్యసాయి బాలవికాస్, పెద్దకమ్మవారిపల్లి పోతలప్పస్వామి గుడి, కర్ణాటక నాగేపల్లి, కమ్మవారిపల్లి రోడ్‌లోని ఎస్‌ఎస్‌ఎస్ ఇంగ్లీషు మీడి యం స్కూల్, కర్ణాటక నాగేపల్లి కింగ్స్ చర్చి వెనుక, సాయినగర్‌క్రికెట్ గ్రౌండులో పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేశారు. అలాగే వైద్య శిబిరాలను గోకులం, చిత్రావతి బ్రిడ్జి, ఆర్టీసీ బస్టాండ్, చిత్రావతి హారతిఘాట్, ఎ నుమలపల్లి పీహెచసీ, సత్యసాయి ఎయిర్‌పోర్టు, మున్సిపల్ కార్యాల యం, రైల్వేస్టేషన వద్ద ఏర్పాటు చేశారు. సమాచార కేంద్రాలను ర మేష్‌విల్లాస్, ఆర్టీసీ బస్టాండ్, కర్నాటక నాగేపల్లి, చిత్రావతి హారతి ఘాట్, సత్యసాయి పార్క్, పెద్దకమ్మ వారిపల్లి జంక్షన, హైవే కట్‌పా యింట్, గణేష్ సర్కిల్, ప్రశాంతినిలయం రైల్వేస్టేషనలలో ఏర్పాటు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....