GOD: కార్తీక సోమవారం పూజలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:52 PM
కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని తాడిమర్రి మండల సరిహద్దులోని కోన మల్లీశ్వర క్షేత్రంలో ఘనంగా పూజలు నిర్వ హించారు. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా పార్న పల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను కోన మల్లీశ్వర క్షేత్రానికి తీసుకొచ్చి పూ జలు చేశారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని తాడిమర్రి మండల సరిహద్దులోని కోన మల్లీశ్వర క్షేత్రంలో ఘనంగా పూజలు నిర్వ హించారు. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా పార్న పల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను కోన మల్లీశ్వర క్షేత్రానికి తీసుకొచ్చి పూ జలు చేశారు. తిరిగి రాత్రి 9గంటల సమయంలో పార్నపల్లిలోని ఆల యానికి తీసుకెళ్లారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. అదేవిధంగా ధర్మవరంరూరల్ మండలంలోని కుణుతూరులో వెలసిన పురాతన చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు, ధర్మవరం పట్టణవాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే గాండ్లపెం టలోని శివాలయం, అయ్యప్పస్వామి ఆలయాల్లో, నల్లచెరువులోని మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించారు. ఆ యా ఆలయకమిటీ సభ్యుల ఆధ్వర్యం లో అన్నదానం నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....