GOD: అయోధ్యకు సైకిల్ యాత్ర
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:43 AM
మం డలపరిధిలోని గంటా పురానికి చెందిన శ్రీని వాసులు మంగళవారం అయోధ్యకు సైకిల్ యాత్ర ప్రారంభిం చారు. మండలంలోని గంటాపురం గ్రామంలో దాతల సహకారంతో రామాలయం నిర్మా ణం చేపట్టారు. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా నిర్మాణం పూర్తి కాలేదు.
బత్తలపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మం డలపరిధిలోని గంటా పురానికి చెందిన శ్రీని వాసులు మంగళవారం అయోధ్యకు సైకిల్ యాత్ర ప్రారంభిం చారు. మండలంలోని గంటాపురం గ్రామంలో దాతల సహకారంతో రామాలయం నిర్మా ణం చేపట్టారు. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా నిర్మాణం పూర్తి కాలేదు. గ్రామంలో రామాలయం నిర్మాణం త్వరగా పూర్తయితే సైకిల్‌పై అయోధ్యకు వస్తానని గ్రామానికి చెందిన శ్రీనివాసు లు అయోధ్య రాముడికి మొక్కుకున్నాడు. అనంతరం ఆలయం నిర్మా ణం పూర్తి అయి 45 రోజుల క్రితం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దీంతో శ్రీనివాసులు శ్రీరాముడి మాల ధరించి అయోధ్యకు సైకిల్ యత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు శ్రీనివాసులును భజనలు చేసుకుంటూ గ్రామ పొలిమేర వరకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నెట్టెం అశోక్, బోయపాటి అప్పస్వామి, సందీప్, వెంకటేశ, మాల్యవంతం బాబు, చిట్టి, బాబు తదితరులు పాల్గొన్నారు.