GOD: భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:49 AM
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా కుమ్మరవాండ్లపల్లిలోని స్తోత్రాద్రి కొండ చుట్టూ స్వామివారి భక్తులు మంగళవారం గిరిప్ర దక్షిణ చేశారు. మొదటగా స్వామివారి భక్తులు లక్ష్మీనరసింహ స్వా మి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి బయల్దేరారు. శ్రీవారు వెలసిన స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం హరినామ కీర్తనలు, గోవింద నామస్మరణతో శ్రీవారి స్తోత్రాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
కదిరి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా కుమ్మరవాండ్లపల్లిలోని స్తోత్రాద్రి కొండ చుట్టూ స్వామివారి భక్తులు మంగళవారం గిరిప్ర దక్షిణ చేశారు. మొదటగా స్వామివారి భక్తులు లక్ష్మీనరసింహ స్వా మి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి బయల్దేరారు. శ్రీవారు వెలసిన స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం హరినామ కీర్తనలు, గోవింద నామస్మరణతో శ్రీవారి స్తోత్రాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు, ప ట్టణ ప్రముఖులు, ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా సమితి సభ్యు లు రజనీకాంత, ధర్మారెడ్డి, నంగి లక్ష్మీరెడ్డి వారి మిత్రబృందం తీర ్థప్రసాదాలు, అల్పాహారం, మంచినీరు, మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ స్తోత్రాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ కోసం రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు.