MINISTERS: ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:40 AM
సత్యసాయిబాబా శతజ యంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమో దీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులు రానున్న సందర్భంగా మంగళవారం పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పనులను మంత్రుల బృం దం పరిశీలించింది.
పుట్టపర్తి టౌన, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజ యంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమో దీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులు రానున్న సందర్భంగా మంగళవారం పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పనులను మంత్రుల బృం దం పరిశీలించింది. జిల్లా ఇనచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, ఆరోగ్యశాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరిశీలించారు. వా రు హిల్‌వ్యూ స్టేడియంలో జరుగుతున్న పనుల పురోగతిపై రాష్ట్ర నోడల్ అధికారులు టి.కృష్ణబాబు, జి.వీరపాండ్యన, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఐజీ షిమోషి భాజ్పై, ఆర్డీఓలు మహేష్, సువర్ణ, వీవీఎస్ శర్మ, ట్రస్టు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.