• Home » 2025

2025

AC: పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

AC: పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

వచ్చే ఏడాది 2025-26 సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్‌ కమిషనర్‌ లాజర్‌ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తగరతి పరీక్షా కేంద్రంలో వసతులు, గదులు, బల్లలు, ఫ్యానలు, మంచి నీటి సౌకర్యంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఆరా తీశారు.

CROPS: పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు

CROPS: పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు

మండలపరిదిలోని గంటాపురం గ్రామంలో సాగు చేసిన కంది, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శాస్త్రవేత్త మాధవిలత, ఏడీఏ లక్ష్మనాయక్‌ బుధవారం పరిశీలించారు. కందిలో మరుకా మచ్చల పురుగును గుర్తించారు. దీని నివారణకు వేప నూనె 1000మి.లీ. క్లోరోఫైరిఫాస్‌ 500మి.లీ. కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు.

GAMES: ఎస్‌జీఎఫ్‌ డివిజన స్థాయి పోటీలు ప్రారంభం

GAMES: ఎస్‌జీఎఫ్‌ డివిజన స్థాయి పోటీలు ప్రారంభం

పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కదిరి డివిజన స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలను డీఈఓ కిష్టప్ప బుధవారం ప్రారంభించారు. బాల బాలికలు అండర్‌ -14, 17 విభాగాలలో చెస్‌, యోగా, షటీల్‌ క్రీడలలో పాల్గొన్నారు.

MLA: అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : ఎమ్మెల్యే

MLA: అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : ఎమ్మెల్యే

మునిసిపాలిటీలో ఏ స్థాయి ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యే బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలోని చైర్‌పర్సన చాంబర్‌లో చైర్‌పర్సన దిల్షాద్‌ ఉన్నీసా, వైస్‌ చైర్మెన రాజశేఖర్‌ ఆచారితో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగి అయినా ఉపేక్షించమని అన్నారు.

MLA:  అభివృద్ధి బాటలో రాష్ట్రం

MLA: అభివృద్ధి బాటలో రాష్ట్రం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని ఎమ్మెల్యే పల్లెసింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పే ర్కొన్నారు. మండలంలోని కొడపగానిపల్లి, వేములేటిపల్లిలకు చెందిన 55 వైసీపీ కుటుం బాలు బుధవారం టీడీపీలో చేచాయి.

MLA: నివాసయోగ్యమైన స్థలాలను గుర్తించండి

MLA: నివాసయోగ్యమైన స్థలాలను గుర్తించండి

ఇళ్లులేని నిరుపేదల కోసం ఉపయోగకరమైన నివాస స్థలాలను వెంటనే గుర్తించాలని పుట్టప ర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి రెవె న్యూ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని మామిళ్లకుంట్లపల్లి పంచాయతీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గతంలో ప్రభు త్వం పేదలకు కేటాయించిన ఎన్టీఆర్‌కాలనీ ప్రాంతాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పరిశీలించారు.

WATER: తాగునీటి సౌకర్యం కల్పించాలి

WATER: తాగునీటి సౌకర్యం కల్పించాలి

తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మండలపరిధి లోని దోరణాల గ్రామస్థులు కోరారు. ఈమేరకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని కటారుపల్లి పంచాయతీ దోరణాల గ్రామంలో తాగునీటి బోరు తరచూ మరమ్మతులకు గురు వుతోందని తెలిపారు.

BJP: స్వదేశీ వస్తువులనే వాడుదాం

BJP: స్వదేశీ వస్తువులనే వాడుదాం

ఆత్మనిర్భర్‌ భా రత కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ, ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులనే వాడుదాం అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వార్డుల్లో, సూపర్‌మార్కెట్లలో స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేక్‌ఇన ఇండియా ఉత్పత్తులనే వాడుదాం, దేశ ఆర్థికవ్యవస్థను బలపరుద్దామంటూ ఆయన పేర్కొన్నారు.

ROAD: మగ్గాల వీధిలో పైపులు పూడ్చి వదిలేసిన రోడ్డు

ROAD: మగ్గాల వీధిలో పైపులు పూడ్చి వదిలేసిన రోడ్డు

ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో... చాలా ప్రాంతాల్లో ఎటు చూసినా గుంతల రోడ్లే ద ర్శన మిస్తున్నాయి. తర చూ రోడ్లను తవ్వడం.. పూ డ్చడం చేస్తుండడంతో సిమెంట్‌ రోడ్లు కాస్త మట్టి రోడ్లుగా, గుంతల రోడ్లుగా మారాయి. రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాట్ల పేరుతో ఉన్న సీసీ రోడ్లను తొలగించి పైప్‌లైన్లను వే శారు. పైపు లైన్లను పూడ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు రోడ్లను మాత్రం బాగు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ROAD: దారంతా గుంతలే..!

ROAD: దారంతా గుంతలే..!

మండలంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతల మ యంగా మారాయి. వర్షాకాలం కా వడంతో ఎటుచూసినా గుంతల్లో నీరు నిలబడి వాహనాల రాకపో కలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాళ్లఅనంతపురం క్రాస్‌ నుంచి హుస్సేనపురం, కొడవం డ్లపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో అధికంగా ఇసుక టిప్పర్లు వెళ్లడంతో తారురోడ్డు ధ్వసమైంది. గతంలో రోడ్డుకు అక్కడక్కడ మరమ్మతులు చేపట్టినా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి