EMPLOYEES: సిబ్బంది ఇష్టారాజ్యం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:26 PM
పట్టణంలోని పార్థసారథి నగర్-2లోని 25 వార్డు సచివాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సిబ్బంది వార్డు సచివాలయం లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అం దుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
వార్డు సచివాలయంలో అందుబాటులో ఉండని వైనం
ప్రజలకు తప్పని ఇబ్బందులు
ధర్మవరం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పార్థసారథి నగర్-2లోని 25 వార్డు సచివాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సిబ్బంది వార్డు సచివాలయం లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అం దుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. ప్రస్తు తం స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి ఉన్న వారు.... ఇంటి మం జూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు పెట్టింది. దీంతో ప్రజలు గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసు కోవడానికి సచివాలయానికి వస్తే ఒక్క అడ్మిన, డేటాఎంట్రీ ఆపరేటర్ తప్ప మిగిలిన వారు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తు న్నారు. వారు ఎప్పు డు వస్తారో ఎప్పుడు వెళ్తారోనని వాపోతున్నారు. పార్థసారథి నగర్-2 సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం 2గంటల పైన అడ్మిన, డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్ప మిగిలిన సిబ్బంది అంతా ఇళ్లకు వెళ్లిపోయారు. మళ్లీ ఎవరూ తిరిగి రాలేదు.
ఇక్కడ రోజూ పరిస్థితి ఇలానే ఉంటోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం రావడం గంట సేపు కాలయాపన చేయడం ఆ తరువాత ఏదో పని ఉందం టూ సచివాలయం నుంచి వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు పేర్కొ న్నారు. ఇదివరకే ఇంటి నిర్మాణం కోసం ధరఖాస్తు చేసుకోవడానికి సచి వాలయానికి వెళ్లినా, సంబంధిత సిబ్బంది సక్రమంగా రాకపోవడంతో హౌసింగ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని స్థానికులు పేర్కొంటు న్నారు. సచివాలయాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా రని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పం దించి సచివాలయంలో సిబ్బంది సాయంత్రం వరకు ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం -సాయికృష్ణ, ఇనచార్జ్ కమిషనర్
పార్థసారథినగర్-2 25వ వార్డు సచివాలయంలో మద్యాహ్నం 2గంట లకే ఇళ్లకు వెళ్లిపోయారన్న విషయం నా దృష్టికి రాలేదు. సచివాలయా న్ని తనిఖీ చేసి విచారిస్తాం మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లి, తిరిగి రానట్టు తేలితే చర్యలు తీసుకుంటాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....