Share News

COMMITTEE: మాలధారుల సేవలో ఆలయ కమిటీ

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:48 AM

ఇప్పటికే అయ్యప్ప మాల ధారణ అన్నిచోట్ల ప్రారంభమైంది. అయ్యప్ప మాలధారులు దీక్షలో ఉన్న రోజుల్లో నిత్యాన్నదానం అందించి ఆదర్శంగా నిలుస్తోంది ముదిగుబ్బ శ్రీపంచగిరీశ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోం ది.

COMMITTEE: మాలధారుల సేవలో ఆలయ కమిటీ
Ayyappa's patrons attended the afternoon almsgiving

దాతల సహకారంతో

ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న భిక్ష

ముదిగుబ్బ, నవంబరు, 24(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే అయ్యప్ప మాల ధారణ అన్నిచోట్ల ప్రారంభమైంది. అయ్యప్ప మాలధారులు దీక్షలో ఉన్న రోజుల్లో నిత్యాన్నదానం అందించి ఆదర్శంగా నిలుస్తోంది ముదిగుబ్బ శ్రీపంచగిరీశ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోం ది. నిత్యం అయ్యప్ప, శివ మాలధారులు సగటున 500 మందికి 62 రోజుల పాటు మధ్యాహ్నం భిక్ష అందిస్తున్నారు. ఇక్కడ భిక్ష అందించే కార్యక్రమం దాదాపు పది రోజుల క్రితం ప్రారంభమైంది

ఆలయ ప్రాంగణంలోనే అన్ని సౌకర్యాలు

మండల కేంద్రంలోని పులివెందుల రోడ్డులో సువిశాల ప్రాంతంలో 19 ఏళ్ల క్రితం అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి అం చలంచెలుగా అభివృద్ధి చెందింది. పులివెందుల నుంచి బెంగుళూరుకు ముదిగుబ్బ మీదుగా అరటికాయల బొలేరోలు, సిమెంటు లారీలు, ఇతర వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రయాణించే మాలఽ దారులు భిక్ష కోసం వెతుక్కునే అవసరం లేకుండా ఇక్కడ వాహనాలు ఆపి హాజరవుతుంటారు. ఇంటి దగ్గర వసతి లేని అయ్యప్ప, శివ, భవా నీ మాలధారులు గుడి ఆవరణలోనే స్నానాది కార్యక్రమాలు ముగించు కుంటారు.


అయ్యప్పల సీజన్లో ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్ర మం ప్రాచు ర్యం పొందడంతో చాలామంది పిల్లల జన్మదిన వేడుకలు, పెళ్లిరోజు వేడుకలను పురస్కరించుకొని భిక్ష కోసం విరాళాలు అం దిస్తున్నారు. మరికొందరు ఒకరోజు ఖర్చుగా భరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జి ల్లాలోని కొన్ని మండలాలకు చెందిన భక్తులు దాదాపు 25 మంది దాకా శాశ్వత అన్నదాతలుగా ఉన్నట్లు కమిటీ సభ్యులు తెలుపుతున్నారు.

మంచి స్పందన వస్తోంది

- సోమగుట్ట సింగారెడ్డి

శ్రీపంచగిరీశ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ధర్మకర్త

మాలధారులకు భిక్ష అందించే అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ము దిగుబ్బ మీదుగా ప్రయాణాలు సాగించే అ య్యప్ప దీక్ష ధారులు మధ్యాహ్నం వేళ ఇక్కడకు భిక్షకు హాజరవుతున్నారు. దాతల సహకారంతో అన్ని సేవలు అందుతున్నాయి. మాలధారణ నుంచి ఇరుముడి వరకు నిత్యం భక్తులకు ఇక్కడే పూజలు, భజనలు చేయిస్తాం. స్నా నాలు చేసుకోవడానికి, రాత్రిపూట పడుకోవడానికి వసతి కల్పిస్తున్నాం. పరస్పర సహకారంతో అందరిని భాగస్వాములను చేసేందుకు సూచిస్తున్నాం.

Updated Date - Nov 25 , 2025 | 12:48 AM