MUSLIMS: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:08 AM
ఇమామ్‌లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
నల్లచెరువు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇమామ్‌లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ నాయకులు వాదలపల్లి అబ్దుల్‌ఖాదర్, దాదం శివారెడ్డి, బార్ బషీర్‌అహ్మద్, మానుసాబ్, మహబూబ్ బాషా, ప్రభుత్వ ఖాజీలు అన్వర్, అమీర్ ఖాన, మండలంలోని మసీదుల ఇమామ్‌లు, మౌజనలు తదితరులు పాల్గొన్నారు.