JSP: సత్యసాయి సేవలు మరువలేనివి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:37 AM
సత్యసాయిబాబా సేవలు మరువలేనివని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని యాదవవీధిలో సత్యసాయిబాబా శతజయంతి సందర్బంగా జనసేన పార్టీ నాయకుడు రాజు ఆధ్వర్యంలో చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్ర మాలకు ముఖ్యఅతిఽథులుగా జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చేనేతప్రముఖులు, టీడీపీ నాయకులు సంధా రాఘవ హాజరయ్యారు.
చిలకం మధు సూదనరెడ్డి
ధర్మవరం, నవంబరు 24(ఆంఽధ్రజ్యోతి): సత్యసాయిబాబా సేవలు మరువలేనివని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని యాదవవీధిలో సత్యసాయిబాబా శతజయంతి సందర్బంగా జనసేన పార్టీ నాయకుడు రాజు ఆధ్వర్యంలో చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్ర మాలకు ముఖ్యఅతిఽథులుగా జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చేనేతప్రముఖులు, టీడీపీ నాయకులు సంధా రాఘవ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సత్య సాయి శివైక్యం పొందినా 15సంవత్సరాలుగా ఆయన చేపట్టిన సేవలను భక్తులు పారదర్శకంగా కొనసాగించడం విశేషమన్నారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన యువకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అన్నదానం చేపట్టారు. అలాగే యాదవవీధిలో నూతనంగా నిర్మిస్తున్న వినాయక ఆలయానికి రూ.లక్ష, ఓడీసీ మండలంలో నిర్మిస్తున్న శివాలయానికి రూ.50వేలు చిలకం మధుసూదనరెడ్డి చేతులమీదుగా విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బెస్త శ్రీనివాసులు, రాజారెడ్డి, అడ్డగిరి శ్యాంకుమార్, సరితాల బాషా, టీడీపీ నాయకులు కొత్తపేట ఆది, కేశగాళ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.