TRAINING: శిక్షణపై అనాసక్తి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:44 PM
స్వచ్ఛత కార్యక్ర మంలో భాగంగా ఎల్‌ఎస్‌డీజీ థీమ్ -5 కింద గ్రామ కార్యదర్శులతో పా టు సర్పంచలు, ఉపసర్పంచలకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివరామ ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్ప హాజరై శిక్షణ ఇచ్చారు. ఉదయం శిక్షణ ప్రారంభంలో పంచాయతీ కార్యాదర్శులతో పాటు సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొన్నా రు.
మధ్యాహ్నం హాజరుకాని సర్పంచులు, ఉప సర్పంచులు
ఓబుళదేవరచెరువు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛత కార్యక్ర మంలో భాగంగా ఎల్‌ఎస్‌డీజీ థీమ్ -5 కింద గ్రామ కార్యదర్శులతో పా టు సర్పంచలు, ఉపసర్పంచలకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివరామ ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్ప హాజరై శిక్షణ ఇచ్చారు. ఉదయం శిక్షణ ప్రారంభంలో పంచాయతీ కార్యాదర్శులతో పాటు సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొన్నా రు. అయితే మధ్యాహ్నం శిక్షణ తరగతుల్లో సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొనకపో వడంతో కేవలం గ్రామ కార్యదర్శులకే అధికారులు స్వచ్ఛతపై శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. జరగబోవు రెండో రోజు శిక్షణ కార్యక్రమంలోనైనా అజెండాలో పొందు పరిచిన వారందరూ హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్పను వివరణ కోరగా.. ఉద యం శిక్షణ తరగతులకు పంచాయతీ కార్యదర్శులతో సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారని తెలిపారు. మధ్యాహ్నం కూడా అందరూ హాజర కావాలని కోరామన్నారు. అయితే మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శులతో పాటు వెంకటాపురం సర్పంచు శంకర్ రెడ్డి తప్ప ఎవరూ రాలేదన్నారు. వారికే శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు.