Share News

HELP: స్టడీ మెటీరియల్‌ పంపిణీకి సాయం

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:51 AM

నియోజక పరిధిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుమారు 1000 విద్యా ర్థులకు మాదిరి ప్రశ్న పత్రాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు స్థానిక సిమ్స్‌ హాస్పిటల్‌ అధినేత నిసార్‌ యాసీన ఖాన, యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు బి. మైనుద్దీన రూ.80 వేలను అందజేశారు. ఈ సొమ్మును వారు సోమవారం సిమ్స్‌ హాస్పిటల్‌ వద్ద యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తాహేర్‌వలికి అందజేశారు.

HELP: స్టడీ మెటీరియల్‌ పంపిణీకి సాయం
Nisar Yasina Khana presenting check to UTF leaders

కదిరి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): నియోజక పరిధిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుమారు 1000 విద్యా ర్థులకు మాదిరి ప్రశ్న పత్రాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు స్థానిక సిమ్స్‌ హాస్పిటల్‌ అధినేత నిసార్‌ యాసీన ఖాన, యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు బి. మైనుద్దీన రూ.80 వేలను అందజేశారు. ఈ సొమ్మును వారు సోమవారం సిమ్స్‌ హాస్పిటల్‌ వద్ద యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తాహేర్‌వలికి అందజేశారు. ఈ సందర్భంగా నిసార్‌ యాసీన ఖాన మాట్లా డుతూ... తన తల్లిదండ్రులు ఉపాధ్యాయులని, వారు పేదల విద్యార్థుల అభివృద్ధి కోసం పడిన తపనను కళ్లారా చూశానని తెలిపారు. అందుకే తాను కూడా పేద విద్యార్థుల కోసం తన వంతుగా సహాయ సహకరాలు అందిస్తున్నానన్నారు. భవిష్య త్తులోనూ విద్య, వైద్యం పరంగా సాధ్యమైనంత మేరకు సేవలం దిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు ఆజం బాషా, మల్లికార్జున, సంతోష్‌కుమార్‌, మధుసూదన, రాజేష్‌, వెంగమనాయుడు, ఖాజా మొహియుద్దీన, రవివర్ధనరెడ్డి, నజీర్‌, సుధాకర్‌, మహబూబ్‌ బాషా, బాబాజాన, హరిప్రసాద్‌, భార్గవ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:51 AM