Share News

MAGISTRATE: హింసను నివారించాల్సిన బాధ్యత అందరిది

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:53 PM

సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.

MAGISTRATE:  హింసను నివారించాల్సిన బాధ్యత అందరిది
Senior Civil Court Magistrate Venkateswarlu

న్యాయాధికారులు

ధర్మవరం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... . మహిళలపై హింస అనేది మానవహక్కుల ఉల్లంఘన అని అందరూ తెలుసుకో వాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే దాడులు, లైంగిక వేధింపుల ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాలసుందరి, సుమలత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:53 PM