AO: కుమ్మరవాండ్లపల్లిలో రైతన్నా... మీ కోసం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:03 AM
మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు.
నల్లచెరువు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓతో పాటు ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, వీఆర్‌ఓ నిర్మల, టీడీపీ నాయకులు సతీష్ చౌదరి, సీనియర్ నాయకులు దేవేంద్ర గౌడ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నల్లమాడ: మండలపరిధిలోని బండ వాండ్లపల్లిలో మంగళవారం ఏడీఏ సనావుల్లా ఆధ్వర్యంలో ‘రైతన్నా... మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైతులు లాభాసాటి పంటలు సాగుచేసి, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన తదితర ప్రభుత్వ పథ కాలపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఏఓ అబ్దుల్‌హక్, ఏఈఓ రంగాచారి, రైతు సేవాకేంద్రం సిబ్బంది శిరీషా, రైతులు పాల్గొన్నారు.