FARMER: రైతుల వద్దకే ప్రభుత్వం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:30 AM
రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ధర్మవరం రూరల్, కదిరి, కొత్తచెరువు, అమడగూరు, గాండ్లపెంట, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు, నల్లమాడ మండలాల్లో వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సోమవారం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్ వర్క్)
రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ధర్మవరం రూరల్, కదిరి, కొత్తచెరువు, అమడగూరు, గాండ్లపెంట, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు, నల్లమాడ మండలాల్లో వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సోమవారం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇల్లు తిరుగుతూ రానున్న ఐదేళ్లలో ప్రభుత్వం రైతుల కోసం చేపట్టే ఐదు విధానాలకు సంబఽంధించి ముఖ్యమంత్రి సందేశం ఉన్న కరపత్రాలను అందజేసి, వివరించారు. దీంతో పాటు ప్రభుత్వం విడుదల చేసిన ఆపామిస్ (ఏపీఏఐయంఎస్) యాప్‌ను రైతుల స్మార్ట్‌ఫోనలో ఇనస్టాల్ చేయించి యాప్ ఉపయోగాలు వివరించారు. కదిరి మండలం కొండమనాయునిపాళ్యం గ్రామంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....