న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. వెయ్యి పరుగులు చేసిన రెండో న్యూజిలాండ్ ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి... పాకిస్థాన్ సూపర్ లీగ్ లోకి వెళ్లనున్నట్లు ప్రకటించాడు.
క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పీట్రాంగెలి(92) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో హరేంద్ర.. కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.
జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ 2025 టోర్నమెంట్ లో భారత్ బోణి కొట్టింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్ తేడాతో నమీబియా జట్టుపై అద్భుత విజయాన్ని అందుకుంది.
కొన్నేళ్లుగా భారత క్రికెట్కు మూలస్తంభాలుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలుస్తూ వచ్చారు. దశాబ్దకాలంగా ఎంతో మంది కోచ్లుగా వచ్చినా జట్టు ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ ప్రధాన కోచ్గా గౌతం గంభీర్ ఆగమనంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాస్త దూకుడు స్వభావం కలిగిన గౌతీ తన కోసమే ప్రత్యేకంగా జట్టును రూపొందించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నాడు....
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(ఆర్ఎస్పీబీ) ముగ్గురు మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతికా రావల్, స్నేహా రానా, రేణుకా సింగ్ ఠాకూర్లను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమించింది.
భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్తో వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఝార్ఖండ్, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు.
అబుదాబీ టీ10 లీగ్2025 విజేతగా యూఏఈ బుల్స్ (UAE Bulls) నిలిచింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ 30 బంతుల్లో 98 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
టెస్టుల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాంచీ వన్డే అనంతరం ఈ వార్తలపై విరాట్ క్లారిటీ ఇచ్చాడు.