Share News

అంధుల క్రికెట్‌కు బీసీసీఐ అండ

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:09 AM

భారత అంధుల క్రికెట్‌కు మంచి రోజులు రానున్నాయి. వీరికి నిర్మాణాత్మక మద్దతిచ్చేందుకు భారత క్రికెట్‌ బోర్డు...

అంధుల క్రికెట్‌కు బీసీసీఐ అండ

న్యూఢిల్లీ: భారత అంధుల క్రికెట్‌కు మంచి రోజులు రానున్నాయి. వీరికి నిర్మాణాత్మక మద్దతిచ్చేందుకు భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ముందుకొచ్చింది. గత దశాబ్దకాలంగా అంధుల జట్లు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో నిలకడగా విజయాలు సాధిస్తున్నాయి. ఇకనుంచి అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లినప్పుడు ఇరుజట్లకు ఏడాదికి రెండుసార్లు ప్రయాణ, వసతి ఖర్చులను బీసీసీఐ భరించనుంది. భారత్‌లో ద్వైపాక్షిక సిరీ్‌సలు జరిగినప్పుడు ఆతిథ్య, పర్యాటక జట్ల వసతిని కూడా బోర్డు చూసుకుంటుంది. బోర్డు ఆధ్వర్యంలోని మైదానాలను, సౌకర్యాలను కూడా అంఽధల జట్లు వినియోగించుకోవచ్చు.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 05:09 AM