Share News

ప్రేయసిని పెళ్లాడిన గబ్బర్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:12 AM

టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ తన ప్రేయసి, ఐర్లాండ్‌ నటి సోఫీ షైన్‌ను శనివారం పెళ్లాడాడు. ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌...

ప్రేయసిని పెళ్లాడిన గబ్బర్‌

ధవన్‌ పెళ్లికి హాజరైన రోహిత్‌ దంపతులు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ తన ప్రేయసి, ఐర్లాండ్‌ నటి సోఫీ షైన్‌ను శనివారం పెళ్లాడాడు. ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకకు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రితిక దంపతులు, క్రికెటర్‌ యజ్వేంద్ర చాహల్‌ తదితరులు హాజరయ్యారు. గబ్బర్‌, సోఫీల నిశ్చితార్థం గతనెల 12న జరిగిన సంగతి తెలిసిందే. ధవన్‌కు ఇది రెండో పెళ్లి. 2012లో ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్న అతను 2021లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరిద్దరికీ జొరావర్‌ అనే కుమారుడు ఉన్నాడు.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 05:12 AM