జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విరాట్, ధోనీ, సచిన్ విగ్రహాల సరసన స్థానం దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ అరుదైన గౌరవం పొందనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులకు రోహిత్ శర్మ కేవలం 41 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్, కోహ్లీ, ద్రవిడ్ తర్వాత ఈ అరుదైన క్లబ్లో స్థానం దక్కించుకునే నాలుగో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. హిట్‌మ్యాన్ రాయ్‌పూర్ వన్డేలో ఈ ఫీట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
రాంచీ వన్డేలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో విఫలమవడంతో రెండో వన్డేలో అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తిలక్ ఆడితే టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడంతో ఒత్తిడిలో ఉన్న గౌతమ్ గంభీర్‌కు రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేశాడు. పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని.. పనిని ఆస్వాదించాలని సూచించాడు.
డిసెంబర్ 7న స్మృతి మంధాన పెళ్లి జరుగుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె సోదరుడు శ్రావణ్ స్పష్టం చేశాడు. పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉందని చెబుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు.
టీ20లతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్లలోనూ తనకు ఆడే సత్తా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటూ తన ఆటను మెరుగుపర్చుకుంటానని వెల్లడించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ ఆకస్మికంగా కన్నుమూశారు. సోమవారం ఆయన నివాసంలో ప్రాణాలు విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోనని చెప్పినట్లు సమాచారం.
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. బెంచ్‌కే పరిమితం చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఎంపిక చేశారని సెలక్టర్లను ప్రశ్నించాడు.