Share News

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:47 PM

గ్రూప్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా సూపర్-8 దశలో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
South Africa vs India

గ్రూప్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా సూపర్-8 దశలో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా కూడా అజేయంగానే నిలిచింది. ఆ జట్టుకు కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం (IND vs SA).


తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బౌలింగ్‌కు సిద్ధమవుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్ స్టేడియం స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. కొద్దిగా స్లోగా ఉండే పిచ్‌పై బంతి అంత సులభంగా బ్యాట్ మీదకు రాదు. స్పిన్ విభాగంలో సఫారీ జట్టు కంటే టీమిండియా కాస్త బలంగా కనబడుతోంది (Match live update).


భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, డికాక్, రికెల్టన్, బ్రావిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో ఎన్‌సన్, బాష్, కగిసో రబాడా, కేశవ్ మహారాజ్, ఎంగిడి

Updated Date - Feb 22 , 2026 | 06:48 PM