Share News

భారత సంతతి క్రికెటర్లు.. ఆ దేశాలకు పేరు తెస్తున్నారు

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:40 AM

భారత సంతతి ప్రజలు ఆయా దేశాలకు గర్వ కారణంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా..భారతీయులు తమ మూలాలకు....

భారత సంతతి క్రికెటర్లు.. ఆ దేశాలకు పేరు తెస్తున్నారు

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని టీ20 వరల్డ్‌ కప్‌ ప్రస్తావన

న్యూఢిల్లీ: భారత సంతతి ప్రజలు ఆయా దేశాలకు గర్వ కారణంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా..భారతీయులు తమ మూలాలకు అనుసంధానమై ఉంటున్నారని గుర్తు చేశారు. ఈక్రమంలో తాము నివసిస్తున్న దేశాల అభివృద్ధికి దోహదపడుతున్నారని తన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత సంతతి క్రికెటర్లు ఆయా దేశాల తరపున రాణిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘టీ20 వరల్డ్‌ కప్‌ను మీరంతా వీక్షిస్తున్నారనుకుంటా. ఆ జెర్సీ వేరే దేశానికి చెందినది. కానీ పేరు వినగానే ఆ క్రికెటర్‌ మన దేశానికి చెందిన వాడని అనిపిస్తుంది. ఆ సమయంలో మీ మది పులకిస్తుంది’ అని ప్రధాని అన్నారు. కెనడా జట్టులో అత్యధిక సంఖ్యలో భారత సంతతి ఆటగాళ్లున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి:

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

Updated Date - Feb 23 , 2026 | 04:40 AM